Bahubali Thali : 30 నిమిషాల్లో ఈ భోజ‌నం పూర్తిగా తిన‌గ‌ల‌రా ? అయితే రూ.1 ల‌క్ష మీవే..!

Bahubali Thali : సాధార‌ణంగా మ‌నం రెస్టారెంట్ల‌కు వెళితే.. అక్క‌డ మ‌న‌కు అనేక ర‌కాల వంట‌కాలు ల‌భిస్తాయి. అందులో భాగంగానే భోజ‌న ప్రియుల అభిరుచుల‌కు అనుగుణంగా వివిధ ర‌కాల రెస్టారెంట్లు అనేక ర‌కాల ఆహారాల‌ను వండి వ‌డ్డిస్తున్నాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో రెస్టారెంట్లు భిన్న ఆఫ‌ర్ల‌తో ముందుకు వ‌స్తున్నాయి. ఒక భారీ భోజ‌నం త‌యారు చేసి దాన్ని తింటే భారీ ప్రైజ్ మ‌నీ ఇస్తామంటూ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది అలాంటి ఆఫ‌ర్ల‌ను ట్రై చేస్తున్నారు. కానీ ఫెయిల్ అవుతున్నారు. ఇక తాజాగా ఇంకో రెస్టారెంట్ కూడా ఇలాంటి ఆఫ‌ర్‌నే అందిస్తోంది. ఆ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉన్న బాహుబ‌లి భోజ‌నాన్ని 30 నిమిషాల్లోగా పూర్తిగా తినాలి. దీంతో రూ.1 ల‌క్ష సొంత‌మ‌వుతుంది. ఇంత‌కీ ఆ రెస్టారెంట్ ఎక్క‌డ ఉందంటే..

హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్‌లో తాజాగా ఓ ఆఫ‌ర్‌ను ప్రారంభించారు. అక్క‌డ అందుబాటులో ఉన్న ఓ భోజ‌నాన్ని 30 నిమిషాల్లో పూర్తిగా తింటే రూ.1 ల‌క్ష న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తారు. దానికి బాహుబ‌లి థాలి అని పేరు పెట్టారు. ఇక ఈ భోజ‌నం ఖ‌రీదు రూ.1800 కాగా దీన్ని 3 లేదా 4 మంది సుల‌భంగా తిన‌వ‌చ్చు. కానీ ఆఫ‌ర్‌లో పాల్గొనాలంటే మాత్రం ఆ భోజ‌నం మొత్తాన్ని ఒక్క‌రే తినాలి. అది కూడా ప్లేట్‌లో ఒక్క వంట‌కం కూడా మిగిల్చకుండా 30 నిమిషాల్లో మొత్తం తినేయాలి. అలా తింటే రూ.1 ల‌క్ష గెలుచుకోవ‌చ్చు.

Bahubali Thali

ఇక ఈ ఆఫ‌ర్‌ను శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో అందుబాటులో ఉంచామ‌ని రెస్టారెంట్ నిర్వాహ‌కులు తెలిపారు. ఈ భోజ‌నంలో 30 ర‌కాల వంట‌కాలు ఉంటాయి. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, ప్రాన్స్ త‌దిత‌ర వెరైటీల‌తోపాటు స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు కూడా ఉంటాయి. అన్నింటినీ తినాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట్రై చేయ‌లేదు. కావాలంటే ఎవ‌రైనా ట్రై చేయ‌వ‌చ్చు. 30 నిమిషాల్లో రూ.1 ల‌క్ష గెలుచుకోవ‌చ్చు. ఇంకెందుకాల‌స్యం.. మీరు ఆ చాలెంజ్‌లో పాల్గొన‌ద‌లిస్తే ఆ రెస్టారెంట్‌కు వెళ్లి రండి మ‌రి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM