Highway Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ హైవే. టాలీవుడ్ లో మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పక విమానంలాంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్.. ఇప్పుడో క్రైమ్ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి వచ్చాడు. ఆనంద్ చేసిన సినిమా అంటే కచ్చితంగా ఏదో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని భావిస్తాము. అందులోనూ డైరక్టర్ కేవీ గుహన్.. గతంలో కళ్యాణ్ రామ్ కు 118 హిట్ ఇచ్చాడు. దీంతో కచ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మన అంచనాలకు తగ్గట్లే సినిమా కొత్తగా ఉందా.. అసలు కథేంటి.. సినిమా వర్కవుట్ అవుతుందా.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ..
డీ అలియాస్ దాస్ (అభిషేక్ బెనర్జీ) హైదరాబాద్ నగరంలో మహిళలపై 5 వరుస హత్యలకు పాల్పడిన సైకోపాత్ కిల్లర్. ఈ వరుస హత్యల వెనుక హంతకుడి అసలు ఉద్దేశం అర్థం కాకపోవడం పోలీసులకు ఈ కేస్ పెద్ద మిస్టరీగా మారుతుంది. ఈ హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను ఆశా భరత్ (సయామీ ఖేర్) చేపడుతుంది. మరో వైపు, వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు (ఆనంద్ దేవరకొండ) తన పని మీద బెంగుళూరుకు బయలుదేరుతాడు.
తులసి (మానస రాధాకృష్ణన్) ఒక పౌల్ట్రీ ఫామ్‌లో తన ఒంటరి తల్లితో కలిసి పనిచేస్తూ జీవిస్తుంటుంది. తన యజమాని వేధింపుపులు భరించలేక పారిపోయిన తులసి యాదృచ్ఛికంగా విష్ణుని కలుస్తుంది. మరోపక్క పోలీసు డిపార్ట్‌మెంట్ సోదాలు ముమ్మరం చేయడంతో దాస్ కూడా నగరం విడిచిపెడతాడు. ఇక సైకోపాత్‌ని పోలీసులు పట్టుకున్నారా ? విష్ణు, తులసికి ఆ సైకోపాత్ ఎదురు పడతాడా ? విష్ణు, తులసి, దాస్ ను ఎలా అడ్డగించారు ? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి.
విశ్లేషణ..
ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. మొత్తం మీద ఈ హైవే చిత్రం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. సినిమా సాగినంతసేపు సస్పెన్స్ తో కూడిన ఆతురత ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈ చిత్రంలోని అన్ని క్యారెక్టర్స్ తమ పాత్రలను మంచిగా పోషించారు. ఈ సినిమాలో చెప్పుకోవలసింది నెగెటివ్ పాత్ర పోషించిన అభిషేక్ బెనర్జీ గురించి. బెనర్జీ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పాత్రలకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఆయన చేసిన పాత్ర కూడా అంతే గుర్తింపు తీసుకు వచ్చేలాగా ఉంది. ఆనంద్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పాత్ర కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.
స్టోరీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ కాగా.. సినిమా ప్రారంభంలో పాట అతికించినట్లుగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉన్న కొన్ని సీన్స్, మిస్సయిన లాజిక్, పూర్ ఎడిటింగ్ వంటివి మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ హైవే మూవీ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. దీన్ని ఒకసారి చూడవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…