Healthy Foods : బాదంప‌ప్పుకు స‌మాన‌మైన పోష‌కాలు ఉండే ఆహారాలు.. ఖ‌ర్చు కూడా చాలా త‌క్కువ‌..

September 19, 2022 9:05 AM

Healthy Foods : మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. ఎప్పుడైతే పోషకాలు మనకు సక్రమంగా అందుతాయో నిత్యం ఆరోగ్యంగా జీవనం గడుపుతారు. ఏదైనా అనారోగ్య సమస్యకు గురైతే చాలు ప్రతి ఒక్కరు బాదం, పిస్తా తినండి బలంగా ఉంటారు అంటూ సలహాలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఒక కేజీ బాదం ఖ‌రీదు దాదాపుగా రూ.800 ఉంటుంది. కేవలం గొప్పవారికి మాత్రమే ఆరోగ్యంలో బలహీనతలు ఉండవు, పేదవారు కూడా అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. ముఖ్యంగా వీరిలో పోషకాల‌ లోపం అనేది అధికంగా ఉంటుంది.

మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ఎంత ఖర్చు చేయటానికైనా సిద్ధంగా ఉంటున్నారు. ఖరీదైన వాటితోనే మనకి పోషకాలు అందుతాయి అనేది చాలా తప్పు. తక్కువ ధరలో దొరికే ఎన్నో ఆహార పదార్థాలలో మంచి పోషక విలువలు కూడా కలిగి ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం పొందే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. శనగలలో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. శాకాహారులకు శనగలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అంతేకాదు శనగలను పేదవాడి బాదం అని కూడా చెబుతారు. శనగలలో ప్రోటీన్ ల‌తో పాటు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శనగలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహకరిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

Healthy Foods we should take them daily for these benefits
Healthy Foods

పెసలలో ప్రొటీన్లు మరియు పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు బలం అందించడంలో సహాయపడుతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి బరువు తగ్గే వారికి ఎంతో ఉపయోగపడుతాయి. అదేవిధంగా పాలకూరలో ఎన్నో పోషకాలు  ఉంటాయి. మనకు అతి తక్కువ ధరలో దొరికే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. వారంలో రెండు సార్లు పాలకూరను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరానికి  అవసరమయ్యే విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది.  ఇది ఎముకల ఆరోగ్యంలో కీలక  పాత్రను పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా దరిచేరనివ్వదు.

అతి తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే వాటిలో మిల్లెట్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. మిల్లెట్స్ లో  ముఖ్యంగా చెప్పుకోవలసినవి సజ్జలు. 100 గ్రాముల సజ్జలలో 3 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తుంది. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. అదేవిధంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. షుగర్ వ్యాధితో బాధ‌పడేవారికి సజ్జలు చక్కని ఆహారం అని చెప్ప‌వచ్చు. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment