Balakrishna : బాల‌కృష్ణ సినిమాల్లో మ‌న‌కు క‌నిపించే కామ‌న్ పాయింట్ ఇదే.. అదేమిటంటే..?

September 3, 2022 9:31 AM

Balakrishna : నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. 1974 లో నంద‌మూరి బాల‌కృష్ణ 14 ఏళ్ల వ‌య‌సులో తాతమ్మ క‌ల‌ అనే చిత్రంతో బాల న‌టుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో తెరంగేట్రం చేశారు. 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు. తరవాత కథానాయకుడు, ముద్దుల మావ‌య్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇంత సక్సెస్ ఫుల్ హీరో అప్పుడప్పుడూ ప్రవర్తన కోపిష్టి  అనిపించినప్పటికీ, బాలయ్యని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు వెన్నలా మృదువైనది, ఎంతో  స్వచ్ఛమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ చేసే పనులు కూడా నిజమే అనిపిస్తుంటాయి. సామాజిక సేవలు అందిస్తూ బాలయ్య ఎంతో మందికి సహాయం చేస్తున్న‌ విషయం తెలిసిందే. ఇండస్ట్రీ మంచి చెడుల గురించి ఆలోచించడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటార‌ని చెప్పొచ్చు.

have you observed one common point in Balakrishna movies
Balakrishna

బాలయ్య చిత్రాల‌ను గమనించి చూస్తే ఈ విషయం మనకు ఎంతగానో అర్థమవుతుంది. బాలయ్య చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ విషయం ఏమిటంటే.. బాలయ్య చిత్రాల్లో ఎక్కువగా తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తారు. పాపులర్ అయిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కనిపిస్తారు తప్ప మిగతా వారు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని భావించేవారు ఎక్కువగా బాలయ్య చిత్రాల్లో కనిపిస్తారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల వారికి ప్రాముఖ్యతను ఇస్తారు అని అనుకునే వాళ్లకు బాలయ్య చిత్రలతో తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు కల్పించటం  ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం ఊరట కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment