రెండు జడలతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

September 2, 2022 10:13 PM

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. రెండు జడలతో, ఆకర్షణీయమైన నవ్వుతో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..  రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

2001లో నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్. నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి. నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి.. ఆడపులి.. అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది.

have you identified charmy kaur in this photo

నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేస్తుంది. ఛార్మి  గౌరీ, చంటి, మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఛార్మి.. పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్‌ నిర్మాణ సంస్థను  ప్రారంభించి నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

ఈ బ్యానర్ పై వచ్చిన ఒక ఇస్మార్ట్ శంకర్ చిత్రం తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది ఛార్మి. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఛార్మి 20 ఏళ్లుగా కూడబెట్టిన సంపాదన ఈ ఒక్క సినిమాతో పోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment