Ayesha Kaduskar : గోవిందుడు అంద‌రి వాడేలో చ‌ర‌ణ్‌కు చెల్లిగా న‌టించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

August 16, 2022 7:58 AM

Ayesha Kaduskar : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మాతగా, కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ హీరో హీరోయిన్స్ గా నటించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, జయసుధ, రెహమాన్, వెన్నెల కిషోర్, ప్రగతి, రవి ప్రకాష్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

అప్పట్లో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీకాంత్, రామ్ చరణ్ బాబాయ్, అబ్బాయ్ గా అందరినీ ఎంతగానో మెప్పించారు. తాత కుటుంబాన్ని తండ్రికి దగ్గర చేయడానికి వచ్చిన కొడుకు గా రామ్ చరణ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ కి చెల్లిగా నటించింది. ఆమె పేరు అయేషా కుదుస్కర్. గోవిందుడు అందరివాడే చిత్రంలో రామ్‌చ‌రణ్ చెల్లెలిగా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది.

govindudu andarivadele movie Ayesha Kaduskar see how is she now
Ayesha Kaduskar

అయితే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలని మీకూ ఉందా.. ఈ చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన‌ ఆ చిన్నారి ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా అందాల భరిణలా తయారయింది. గోవిందుడు అందరివాడేలో చెర్రీ చెల్లెలిగా నటించిన‌ చిన్నది ప్రస్తుతం చూడడానికి హీరోయిన్ మాదిరిగా మారిపోయింది. మోడ్ర‌న్ డ్రెస్ లో మెరిసిపోతూ కుర్రకారు మతులు పోగొట్టే విధంగా ఉంది.

ప్రస్తుతం ఉన్న‌త‌ చదువుల కారణంగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉందని టాక్ వినిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుందట. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు వైర‌ల్‌గా మారుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment