Garlic And Cinnamon : ఈ డ్రింక్ ను తాగితే షుగ‌ర్‌ పేషెంట్స్ మందుల జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!

September 1, 2022 8:58 PM

Garlic And Cinnamon : ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వలన అనేక అనారోగ్యాల బారినపడుతున్నాం. ఈ అనారోగ్యానికి తోడు డాక్టర్ రాసే మందుల వాడకంతో కొత్త సమస్యలు తలెత్తడం మొదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిట్కా డయాబెటిస్ పేషంట్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంట్లోని చక్కెర స్థాయిల‌ని తగ్గించి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది.

మన ఇంటిలో మన నిత్యం ఉపయోగించే దాల్చిన చెక్క, వెల్లుల్లిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాల‌ను పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. డాక్టర్ రాసే మందులతో నానా యాతన పడే కన్నా ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. వెల్లుల్లి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ వల్ల ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి సహకరిస్తుంది.

Garlic And Cinnamon can help diabetes patients control blood sugar levels
Garlic And Cinnamon

అదేవిధంగా దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహకరిస్తుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచే అద్భుత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను బాగా న‌లిపి నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించి ఒక గ్లాస్ లోకి వడకట్టాలి. దీనిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఈ డ్రింక్ ను ఏ సమయంలోనైనా తాగవచ్చు. కానీ ఈ డ్రింక్ ను తాగడానికి అరగంట ముందు నుంచి కడుపును ఖాళీగా ఉంచుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువ మంది మందుల వాడకం వలన మలబద్దకం సమస్యకు గురవుతారు. ఈ డ్రింక్ ను తీసుకోవడం ద్వారా ఆహారం త్వరగా జీర్ణం అయ్యి మలబద్ధక సమస్య తీరుతుంది. ఈ విధంగా ఈ డ్రింక్‌తో ఓ వైపు షుగ‌ర్ మ‌రో వైపు మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment