Esha Gupta : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు కష్టాలను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలబడాలన్నా, అవకాశాలు రావాలన్నా తప్పకుండా కమిట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని పలువురు వారు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ కష్టాల గురించి తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా కూడా తను ఈ విధమైన క్యాస్టింగ్ కౌచ్ కష్టాలను ఎదుర్కొంటున్నానని ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా గుప్తా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. తాను మొదట్లో ఈ విధమైన ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలియజేసింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం అవుట్ డోర్ షూటింగ్ వెళ్లామని అక్కడ ఓ నిర్మాత ఎన్నో ఇబ్బందులు పెట్టాడని ఈషా తెలిపింది. ఆ నిర్మాతకు భయపడి మేకప్ ఆర్టిస్ట్ ని తన దగ్గర పడుకోమని చెప్పేదాన్ని అంటూ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది.
ఇక మరో ఇద్దరు డైరెక్టర్లు తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తనని వారి రూమ్ కి రావాలని, వారి పక్కన పడుకోవాలని తెలిపారు. ఇలా కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడటంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారికి ఎలాంటి బాధలు ఉండవు కానీ కొత్తగా బయటనుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ విధమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…