గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Eesha Rebba : వెబ్ సిరీస్ లో మెరిసేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈషా రెబ్బా..!

Eesha Rebba : ప్రస్తుతం సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్ కు కూడా బాగా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు ఉన్న పాపులారిటీని గమనించి చాలా మంది దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్…

Eesha Rebba : వెబ్ సిరీస్ లో మెరిసేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఈషా రెబ్బా..!

Eesha Rebba : ప్రస్తుతం సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్ కు కూడా బాగా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లకు ఉన్న పాపులారిటీని గమనించి చాలా మంది దర్శక నిర్మాతలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లో సందడి చేయగా త్వరలోనే రకుల్, చైతన్య వంటి సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Eesha Rebba is preparing to act in web series

తాజాగా రవి నంబూరి కథతో మ్యాగీ దర్శకత్వంలో తెలుగు ఓటీటీ ఆహా కోసం ‘త్రీ రోజెస్‌’ అనే వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఇందులో నటించడం కోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరిగా ఈశా రెబ్బ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్, ఆదాశర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనే విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే ఈమె ఇందులో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి