Eesha Rebba : న‌లుపు రంగు చీర‌లో గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శిస్తున్న ఈషా రెబ్బా..!

January 28, 2022 5:42 PM

Eesha Rebba : గ్లామ‌ర్ ను ఒల‌క‌బోయ‌డంలో ప్ర‌స్తుత త‌రుణం హీరోయిన్లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఒక‌రిని మించి ఒక‌రు అందాల‌ను ఆర‌బోస్తున్నారు. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా అన్ని హ‌ద్దుల‌ను చెరిపేస్తోంది. అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో చేస్తోంది. సంప్ర‌దాయ బ‌ద్ద‌మైన చీర‌ను ధ‌రించి కూడా యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. స్లీవ్‌లెస్ జాకెట్‌, సిల్క్ చీర‌లో ఈషా రెబ్బా తాజాగా రెచ్చిపోయింది.

Eesha Rebba in black color saree latest photos

ఈషా రెబ్బాకు వాస్త‌వానికి ఏదీ క‌ల‌సి రాలేదు. ప‌లు మూవీల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ పెద్ద‌గా హిట్ కాలేదు. టాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్ కావ‌ల్సి ఉంది. కానీ కాలం క‌ల‌సి రావ‌డం లేద‌నే చెప్ప‌వ‌చ్చు. అందం, అభిన‌యం అన్నీ ఈమెలో ఉన్నాయి. అయితే తెలుగు హీరోయిన్ అయినందునే ఈమెకు సరిగ్గా అవ‌కాశాలు రావ‌డం లేద‌ని అంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఓ ప‌క్క‌న వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు. కానీ ఈషా తెలుగు అమ్మాయి అయినందునే ఈమెకు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని అంటున్నారు. ఒక వేళ వ‌చ్చినా ఆ సినిమాలు పెద్ద‌గా హిట్ కావ‌డం లేదు. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

ఎన్‌టీఆర్ అర‌వింద స‌మేత సినిమాలో ఈషా రెబ్బా న‌టించింది. అయితే అందులో ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేద‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో సినిమా హిట్ అయినా.. ఈమెకు పెద్ద‌గా ఏమీ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు.

అక్కినేని అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌లోనూ ఈషా రెబ్బాకు అవ‌కాశం వ‌చ్చింది. కానీ అందులోనూ ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. అయిన‌ప్ప‌టికీ ఈషా ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ షో చేస్తూ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అయినా ఆమెకు అవ‌కాశాలు రావ‌డం లేదు. తాజాగా ఈమె చేసిన ఫొటోషూట్ అంద‌రినీ క‌ట్టి ప‌డేస్తోంది. మ‌రి గ్లామ‌ర్‌ను ఒల‌కబోసినా.. ఈమెకు ముందు ముందు మంచి అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment