గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Srinu Vaitla : శ్రీను వైట్ల ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవర్తన నచ్చక ఏం చేశాడో తెలుసా?

Srinu Vaitla : దర్శకులు సినిమా కోసం కథలను ఊహించుకొని సొంతంగా రాయడమే కాకుండా బయట జరిగిన కొన్ని సంఘటనలను కూడా తమ సినిమా కథలలో తీసుకుంటుంటారు. ఇప్పటికీ అలా ఎంతోమంది డైరెక్టర్లు తమ కథలలో బయట విషయాలను…

Srinu Vaitla : శ్రీను వైట్ల ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవర్తన నచ్చక ఏం చేశాడో తెలుసా?

Srinu Vaitla : దర్శకులు సినిమా కోసం కథలను ఊహించుకొని సొంతంగా రాయడమే కాకుండా బయట జరిగిన కొన్ని సంఘటనలను కూడా తమ సినిమా కథలలో తీసుకుంటుంటారు. ఇప్పటికీ అలా ఎంతోమంది డైరెక్టర్లు తమ కథలలో బయట విషయాలను చేర్చుకోగా కొందరు కొన్ని పాత్రలకు తమకు నచ్చని, నచ్చిన వ్యక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలను తీశారు. అలా శ్రీను వైట్ల కూడా ఏకంగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ నే దృష్టిలో పెట్టుకుని అతని గురించి తన సినిమాలో కొన్ని సీన్లు తీశాడు.

do you know what Srinu Vaitla done for that music director behavior

డైరెక్టర్ శ్రీను వైట్ల ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చాలా వరకు తన సినిమాలలో బయట విషయాలను చూపిస్తుంటాడు. ఇదిలా ఉండగా.. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో బ్రహ్మానందం నటించిన జయసూర్యను పాత్రను కూడా ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను ఉద్దేశించి చేశాడట.

శ్రీను వైట్ల తన దర్శకత్వంలో తెరకెక్కించిన ఢీ సినిమా సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో ఆయనను దృష్టిలో పెట్టుకొని కింగ్ సినిమాలో జయసూర్య పాత్రను తెరకెక్కించాడట. కానీ చాలా మంది ప్రేక్షకులు జయసూర్య పాత్రను రియల్ లైఫ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాగా ఉందని అనుకున్నారు. కానీ చక్రి ప్రవర్తన నచ్చకపోవడంతోనే శ్రీను వైట్ల ఇలా చేశాడని తెలిసింది. ఇలా శ్రీను వైట్ల కొందరి గురించి తన సినిమాల్లో చూపిస్తుంటాడు. కానీ చక్రి విషయంలో అది దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి