Sukumar : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈయన తీసిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ మధ్యనే ఈయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ఈయన పుష్ప 2 మూవీని తెరకెక్కించనున్నారు. అయితే అందరు దర్శకులు, నటీనటులకు సెంటిమెంట్లు ఉన్నట్లుగానే సుకుమార్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేమిటి.. దాని వెనుక ఉన్న విశేషాలు.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడు సుకుమార్ తన చిత్రాలు షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఆయన షేవింగ్ చేయరు. ట్రిమ్మింగ్ చేయరు. గడ్డాన్ని అలాగే పెంచుతారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకే షేవ్ చేస్తారు. కానీ ఆయన తన సెంటిమెంట్‌ను ఈ మధ్యనే మార్చుకున్నారు. సినిమా రిలీజ్ అయినా సరే షేవ్ చేయలేదు. కానీ ట్రిమ్ చేశారు. దీంతో ఆయన గడ్డాన్ని ట్రిమ్ చేసిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సెంటిమెంట్‌ను అయితే వదల్లేదు. కానీ దాన్ని కాస్తంత మార్చారు. అందువల్లే ఆయన ఇప్పుడు కూడా గడ్డంతోనే కనిపిస్తున్నారు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఆయన ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అయితే ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే వచ్చే నెలలో పుష్ప 2 షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు లేదా వేసవిలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావించవచ్చు. మరి దీనిపై వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…