Hello Brother Movie : అక్కినేని నాగార్జున యువ సామ్రాట్‌గా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచారు. ఆయన ఎన్నో చిత్రాల్లో నటించగా.. అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఆయనకు ఎంతో పేరు వచ్చింది. అయితే ఆయన చేసిన చిత్రాల్లో ది బెస్ట్ అనిపించుకునే సినిమాలు తక్కువే ఉన్నాయి. అలాంటి వాటిల్లో హలో బ్రదర్ కూడా మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. 1994 ఏప్రిల్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని రూ.2.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
1993లో నాగార్జున హీరోగా వచ్చిన వారసుడు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో నాగార్జున ఈవీవీతో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఈవీవీ సత్యనారాయణ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన ట్విన్ డ్రాగన్ కథను నాగార్జునకు వినిపించారు. ఈ సినిమా చేద్దామని చెప్పగా నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విధంగా హలో బ్రదర్ సినిమాను అనుకున్నారు.
ఇక ఈ చిత్రానికి ఎల్బీ శ్రీరామ్ డైలాగులు రాశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్యలను హీరోయిన్లు గా తీసుకున్నారు. షూటింగ్ కూడా చక్కగా పూర్తి చేశారు. ట్విన్స్ అనే కాన్సెప్ట్ తో అప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఇద్దరు కవలలు ఒకే రకంగా ప్రవర్తించడం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తీశారు. దీంతో సినిమా హిట్ అయింది. ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. అదేవిధంగా 30 కేంద్రాల్లో 50 రోజులు 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులను తిరగరాసింది. ఇక ఈ మూవీ మొత్తంగా రూ.15.25 కోట్ల గ్రాస్‌ను సాధించగా.. రూ.8.50 కోట్ల షేర్‌ను వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ నాగార్జున కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…