గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pawan Kalyan : మొదటి భార్య వ‌ల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో తెలుసా ?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో స్టైల్, యాక్షన్…

Pawan Kalyan : మొదటి భార్య వ‌ల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో తెలుసా ?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ చేసే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో స్టైల్, యాక్షన్ కు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ లైఫ్ లో జరిగిన పెళ్ళిలపై మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటూ అటు సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయాల్లోనూ మార్మోగిపోతూ ఉంటుంది.

do you know how Pawan Kalyan is faced troubles with first wife

ఇక పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ గురించి అందరికీ తెలుసు గానీ.. మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలీదు. వీరి పెళ్ళి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నా కూడా పలు కారణాల వల్ల ఆమెతో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ ను తన ఫస్ట్ భార్య ఎన్నో ఇబ్బందులు పెట్టారనేది ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. విడాకులతోపాటు భరణంగా పెద్ద సంఖ్యలో డబ్బును ఇవ్వాలని కోర్టులో ఇబ్బందులకు గురిచేశారట. కుటుంబంలోనూ, సమాజంలోనూ పవన్ కళ్యాణ్ కు ఎన్నో సార్లు చుక్కలు చూపించారని అంటున్నారు.

నందినితో పవన్ కళ్యాణ్ తన బంధాన్ని పూర్తిగా చెరిపేసుకున్న తర్వాత రేణు దేశాయ్ తో ప్రేమలో ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్, తన మొదటి భార్య నుండి విడాకుల తర్వాత పెళ్ళికి ముందే రేణు దేశాయ్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అందరి అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్నారు. ఓ రష్యన్ అమ్మాయితో ఇటీవల పవన్ కు మూడో పెళ్ళి జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికి ఓ బిడ్డ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజంట్ అటు రాజకీయాలలోనూ.. ఇటు సినిమాలలోనూ బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి