Sri Reddy : నెలకు శ్రీరెడ్డి సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు..!

September 15, 2022 10:35 AM

Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ నటి శ్రీ రెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో శ్రీరెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శన చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది.

శ్రీరెడ్డికి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆమె బాగానే సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. యూట్యూబ్ లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అందుకే యూట్యూబ్ ఆమెకు ద్వారా నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఇంత రాయల్ గా చెన్నైలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీరెడ్డికి ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమెకు యూట్యూబ్ ద్వారా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

do you know how much Sri Reddy earns per month
Sri Reddy

ఎంత యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినా ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె మెయింటెన్స్ ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏపీలోనే ఓ రాజకీయ పార్టీకి ఆమె మద్దతు తెలుపుతుంది కనుక ఆ పార్టీ నాయకుల నుండి ఫండ్స్ వస్తాయి అనేది కూడా కొందరి అభిప్రాయం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయల సంపాదనను కలిగి ఉంటుందట. అందులో ఆమె గృహ అవసరాలు ఇతర ఖర్చులు దాదాపుగా మూడు లక్షల వరకు అవుతాయట. అంత భారీగా ఆమె ఖర్చు చేస్తుంది అంటే ఏ రేంజ్ లో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now