Prabhas : ప్ర‌భాస్ కు మేక‌ప్ చేసే వాళ్ల‌కు అంత మొత్తం ఇస్తున్నారా..? వామ్మో..!

December 4, 2022 4:31 PM

Prabhas : వెండితెరపై నటీనటులు తళుక్కున మెరవాలంటే వారు వేసుకున్న మేకప్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. తెరమీద తమ అభిమాన నటీనటులు అందంగా, ఆకర్షణగా కనిపించాలని అభిమానులు కూడా కోరుకుంటారు. ఇక‌ మేకప్ మ్యాన్ ల‌కి మన స్టార్ హీరోలు ఎంత జీతం ముట్టజెబుతారో ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే మేకప్ మ్యాన్స్ కి, టచ్ అప్ బాయ్స్ కి సొమ్ము బాగానే అందుతోందని అంటున్నారు. సినిమా బడ్జెట్, రోల్, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మేకప్ అవసరాన్ని బట్టి లోకల్ మేకప్ మ్యాన్ కావాలా, ముంబయి నుంచి స్పెషల్ ట్రైన్డ్ మేకప్ మ్యాన్ లు కావాలా.. అని చ‌ర్చిస్తారు, దీన్ని షూటింగ్ కు వెళ్లేముందు ఖరారు చేస్తారు.

ఇక మన స్టార్ హీరోల విషయానికి వస్తే.. వంద కోట్ల క్లబ్ రేంజ్ కనుక అందుకు తగ్గట్టే మేకప్ మ్యాన్ ల‌కి చెల్లింపులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే లోక‌ల్ మేక‌ప్ మ్యాన్‌లు అయితే రోజుకు సుమారుగా రూ.5వేల‌కు ఇస్తార‌ట‌. అలాగే ముంబై నుంచి రప్పిస్తే రోజు కాల్ షీట్ కి రూ.6వేల నుంచి రూ.8వేల వ‌ర‌కు ఇస్తున్నార‌ట‌. ఇక ముంబై నుంచి వచ్చినందుకు సౌకర్యాలు, విమాన ఖర్చులు అదనం. అలాగే చెమట తుడిచే టచ్ అప్ బాయ్ కి కాల్ షీట్ కి మూడు వేల వరకు ముడుతుందట. స్టార్ హీరో ప్రభాస్ భారీ క్రేజీ చిత్రాల్లో నటించడం వలన లొకేషన్ లో పర్మినెంట్ గా ముంబై మేకప్ మ్యాన్ లను ఉపయోగిస్తున్నారట.

do you know how much for Prabhas make up artists
Prabhas

ఇక విదేశీ షూటింగ్స్ కైతే టాప్ మోస్ట్ మేకప్ మ్యాన్ లను రంగంలో దించుతున్నారట. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోలకు కూడా అవసరాన్ని బట్టి ముంబై మేకప్ మ్యాన్స్ ని ఉపయోగిస్తున్నారట. ఈవిధంగా బాలీవుడ్ కి దీటుగా మేకప్ మ్యాన్ ల విషయంలోనూ మన స్టార్ హీరోలు పోటీగా నిలుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment