Dhanush : సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్ సాధించారు. దీంతో తమిళ స్టార్ నటుడు అయ్యారు. ధనుష్ అంటే చాలా మందికి అభిమానమే. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాక ఆయన రేంజే మారిపోయింది. అయితే వాస్తవానికి ధనుష్‌ది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. రోజుకు కేవలం ఒక పూట తిండి మాత్రమే తినేవారు. అలాంటి స్థితి నుంచి ధనుష్ స్టార్ అయి రజనీకి అల్లుడు ఎలా అయ్యారు ? ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. ఇక దీని వెనుక ఉన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుష్ ది చాలా పేద కుటుంబం. తండ్రి పేరు కస్తూరి రాజా. తల్లిపేరు విజయ. 1983 జూలై 23వ తేదీన ధనుష్ జన్మించాడు. ఆయన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ఆయనకు ఇద్దరు సోదరీమణులు. విమలలత, కార్తీక. సోదరుడు సెల్వ రాఘవన్. ఈయన ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అయ్యారు. అయితే అప్పట్లో కస్తూరి రాజా ఒక మిల్లులో పనిచేసేవారు. అక్కడ ఇచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో ధనుష్ కుటుంబం రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవారు. తరువాత కస్తూరి రాజా కథలు రాయడం ప్రారంభించారు. వాటిని ఒక్కొక్కటి రూ.50 చొప్పున అమ్మేవారు. అయితే వాటిని తీసుకుని కొందరు రచయితలు తామే వాటిని రాశామని చెప్పి దర్శకులు, నిర్మాతలకు వాటిని రూ.లక్షలకు అమ్ముకునేవారు. అయితే రోజు రోజుకీ కస్తూరి రాజాకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన సినిమాల్లో చేరి ఎలాగైనా దర్శకుడు కావాలని అనుకునేవారు.
ఆ విధంగా కస్తూరి రాజా ఎంతో కష్టపడి దర్శకుడు అయ్యారు. మొదట్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలా 15 ఏళ్లు చేశాక దర్శకుడు అయ్యారు. అయితే తన ఇద్దరు కుమారుల్లో సెల్వ రాఘవన్ కూడా దర్శక రంగంలోకి వచ్చేశారు. కానీ ధనుష్ ఒక్కడే చదువును ఇంటర్‌తో ఆపేసి ఖాళీగా ఉన్నారు. దీంతో ఆయనను కూడా సినిమాల్లోకి రప్పించాలని చూశారు. అందులో భాగంగానే ధనుష్‌ను హీరోగా పరిచయం చేస్తూ 2002లో తులువదో ఇలమై అనే సినిమా తీశారు. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పట్లో ధనుష్ ఇంకా సన్నగా ఉండేవారు. శరీరాకృతి కూడా సరిగ్గా ఉండేది కాదు. దీంతో ఆయనను అందరూ అవమానించారు.
అయితే తరువాత 2003లో కాదల్ కొండెయిన్ అనే సినిమాతో మళ్లీ హీరోగా ధనుష్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ మాత్రం హిట్ అయింది. దీంతో ధనుష్ వెనకకి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చాలా వరకు హిట్ అయ్యాయి. అయితే రెండో సినిమాను చూసేందుకు ఒకసారి ఐశ్వర్య రజనీకాంత్ గెస్ట్‌గా వచ్చారు. అక్కడే ధనుష్‌తో పరిచయం అయింది. వారి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
ఇక కుమార్తె నిర్ణయాన్ని కాదనలేని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరికీ పెళ్లి జరిపించారు. దీంతో వీరి వివాహం 2004 నవంబర్ 18వ తేదీన జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. యాత్ర రాజా పెద్ద కుమారుడు కాగా.. లింగ రాజా చిన్న కుమారుడు. అయితే వీరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది. ఇద్దరూ కలసి ఎంతో కలసి మెలసి అన్యోన్యంగా జీవించారు. ఒక ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేసి అనేక సినిమాలను నిర్మించారు. వాటిల్లో రజనీకాంత్ మూవీలు కూడా ఉన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. 2022 జనవరి 17వ తేదీన ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వార్త విన్న ఫ్యాన్స్ షాకయ్యారు. అసలు బాగా అన్యోన్యంగా ఉండే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. అనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ సూపర్ స్టార్ రజనీ మాత్రం ఈ ఇద్దరినీ కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నించారట. అయినప్పటికీ ఆయన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇక ప్రస్తుతం వీరు విడి విడిగానే ఉంటున్నారు.
ఇలా ధనుష్ ఒకప్పుడు పూటకు తిండికి కూడా నోచుకోని పరిస్థితి నుంచి అంచెలంచెలుగా స్టార్ నటుడిగా ఎదిగి సూపర్ స్టార్‌కు అల్లుడు అయ్యారు. ఈ మధ్యే ఈయన నటించిన అత్రంగీ రే అనే హిందీ మూవీతోపాటు మారన్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. కానీ ఇవి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…