Deepak Saroj : అతడు మూవీలో చేసిన ఈ బాల‌న‌టుడు గుర్తున్నాడా.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

August 16, 2022 9:31 AM

Deepak Saroj : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇందులో త్రిష హీరోయిన్ కాగా మణిశర్మ సంగీతం అందించారు. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గా నటించిన కుర్రాడు.. నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా..? అని అడిగితే.. ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో.. అని బ్రహ్మానందం అనే డైలాగ్ పటాస్ లా పేలింది.

అలాగే మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్ర మూవీలో అన్నయ్య సాంబార్‌లో చికెన్ వేసుకో బాగుంటుంది అని.. ఓ చిన్నోడికి చిన్నది చెప్తుంది. అతడు మూవీలో చేసిన ఆ కుర్రాడే ఆ చిన్నోడు. అంతవరకూ బాగానే ఉంది అసలు విషయం ఏమిటంటే.. ఈ కుర్రాడి పేరు దీపక్ సరోజ్. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. టీనేజ్ లోకి వచ్చిన ఇతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

do you know how Deepak Saroj is now
Deepak Saroj

దీపక్ చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపుగా 20 సినిమాలకు పైగానే నటించి మిణుగురులు సినిమాలో నటించాడు. 2014లో వచ్చిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకున్నాడు. ఆ మధ్య బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో దీపక్ పేరు విన్పించినా ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మోడలింగ్ వైపు అడుగులు వేస్తున్నాడు దీపక్. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫిజిక్‌తో బాగానే రెడీ అయ్యాడు దీపక్. మరి చూడాలిక.. ఏ మూవీతో ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తాడో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment