NTR : సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. వారి పర్సనల్ విషయాలతోపాటు వారు వాడే వస్తువులపై ఓ కన్నేసి ఉంచుతుంటారు. ఇటీవల RRR సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ పేరు ఏంటంటే.. Patek Philippe Nautilus 5712 1/A.. ఇంగ్లాండ్‌కి చెందిన ఈ బ్రాండ్ ధర రూ. 1 కోటి 70 లక్షల పైనే. రిచ్ వాచ్ లను ఎన్టీఆర్ ధరించడం కొత్తేమీ కాదు.. గతంలో కూడా ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ధరించారు. దీని ధర రూ. 4 కోట్లు ఉంటుంది.
ఇలాంటి కాస్ట్‌లీ వాచెస్ ఎన్టీఆర్ దగ్గర మరో రెండు ఉన్నాయట. ఇక రీసెంట్‌గా ఎన్టీఆర్ ఖరీదైన లంబోర్ఘిని కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కి కార్లు, వాచ్, డ్రెస్‌లు అంటే చాలా ఇష్టమట. నచ్చితే ధరెంతైనా పెట్టేస్తాడట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. కీరవాణి సంగీతం అందించగా, విజయేంద్రప్రసాద్ కథని అందించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది.
డీవీవీ దానయ్య రు.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రూ.1200 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లోనే 13 మిలియన్ డాలర్ల వసూళ్లు కొల్లగొట్టేసింది. త్రిపుల్ ఆర్ సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిక్కిక్కలినేని సుధాకర్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…