Liger Movie First Day Collections : లైగ‌ర్ మూవీ తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా..?

August 26, 2022 7:03 PM

Liger Movie First Day Collections : పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా లైగర్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో భారీ అంచనాలతో దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదలైయింది. హీరోయిన్ అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్‌పాండే, రోనిత్ రాయ్, ఆలీ, గెటప్ శ్రీను వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ‌స్ట్ షో నుంచే ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ ను అందుకుంది. సినిమా అసలు ఏమాత్రం బాగోలేదు అంటూ ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్‌ మినహా చిత్రం వారంలోపే థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కెరీర్‌లో అత్యంత‌ చెత్త సినిమా ఇదే అంటూ విమర్శలు వెలువడుతున్నాయి.

do you know about Liger Movie First Day Collections
Liger Movie First Day Collections

కలెక్షన్స్ పరంగా లైగర్ భారీ అంచనాలతో దూసుకుపోతోంది అనుకుంటే అందరి అంచనాల‌ను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు మార్నింగ్ షోకే సినిమాకి దారుణమైన నెగెగిటివ్ టాక్ రావడంతో, ఆ ఇంపాక్ట్ లైగర్ నెక్స్ట్ షో పై పడింది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా లైగర్ చెత్త రికార్నుడు నమోదు చేసింద‌ని చెప్ప‌వచ్చు. మరీ ముఖ్యంగా నార్త్ లో విజయ్ రేంజ్ ను ఊహించుకుంటే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు లైగర్ సినిమా రూ.24.50 కోట్ల గ్రాస్, రూ.13.35 కోట్ల షేర్ ను అందుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలిరోజున లైగర్ చిత్రానికి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ వివ‌రాలేంటో చూద్దాం. రాయలసీమ రూ.1.32 కోట్లు, తెలంగాణ రూ.4.24 కోట్లు, నెల్లూరు రూ.40 కోట్లు, కృష్ణా రూ.48 కోట్లు, వెస్ట్ రూ.0.39 కోట్లు, గుంటూరు రూ.0.83 కోట్లు, ఈస్ట్ రూ.0.64 కోట్లు వ‌చ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తొలి రోజు టోటల్ థియేటర్ షేర్ రూ.9.57 కోట్లు, గ్రాస్ రూ.15.40 కోట్లు, బ్రేక్ ఈవెన్ షేర్ రూ.62 కోట్లు రాబట్టుకుంది. అంతేకాకుండా వర‌ల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ షేర్ తొలిరోజు రూ.90 కోట్లను రాబట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment