Kubera Pooja : లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆమె అనుగ్రహించి ధనాన్ని అందిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ధనం కోసం కుబేరుడిని కూడా పూజించవచ్చు. కుబేరుడు ధనానికి అధిపతి. ఆయన సిరిసంపదలకు, నవ నిధులకు అధిపతి. ఉత్తర దిక్పాలకుడు. కనుక కుబేరున్ని పూజించినా కూడా సిరి సంపదలను అనుగ్రహిస్తాడు.
ఇక కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు కనుక ఆయనకు పూజ చేయాలంటే మీ పూజ గదిలో ఉత్తరం దిక్కున కూర్చోవాలి. అనంతరం చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రని వస్త్రాన్ని పరచాలి. కలశాన్ని ఉంచాలి. నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఆ కలశాన్ని పూజించాలి. తరువాత కుబేరుని యంత్రాన్ని ఉంచి పంచామృతంతో అభిషేకం చేయాలి. కుబేరుని యంత్రం, ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచాలి.
కుబేరుడికి ధాన్యం, బెల్లం అర్పించాలి. ఇంట్లో ఉన్న బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి ఆ తరువాత పూజ ప్రారంభించాలి. పూజలో భాగంగా 5 సార్లు.. ఓం గం గణపతయే నమః అని జపించాలి. అలాగే ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసి మాలతో 108 సార్లు జపించాలి.
పూజలో కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించాలి. పూజ గదిలో స్వస్తిక్ గుర్తును ఉంచాలి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…