గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ట్రైలర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

Sarkaru Vaari Paata : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగ భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ…

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ట్రైలర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

Sarkaru Vaari Paata : సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగ భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇక చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే తాజాగా ఈ చిత్రానికి చెందిన అఫిషియల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఇందులో మహేష్‌ బాబు పెర్ఫార్మెన్స్‌ అదరగొట్టాడు.

did you notice this in Sarkaru Vaari Paata trailer
Sarkaru Vaari Paata

సాధారణంగా మహేష్‌ బాబు తన సినిమాల్లో కామెడీ చేయడం తక్కువే. అలా చేసిన ఖలేజా మూవీ ఫ్లాప్‌ అయింది. కనుక కామెడీ జోలికి మహేష్‌ ఎక్కువగా వెళ్లడం లేదు. కానీ సర్కారు వారి పాట ట్రైలర్‌ను చూస్తే మహేష్‌ కాస్త కామెడీ ఎక్కువగా చేశాడనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు సాఫ్ట్‌ డైలాగ్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న మహేష్‌ కూడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ను మాట్లాడడం మొదలు పెట్టాడు. సర్కారు వారి పాట ట్రైలర్‌ను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందులో ఆయన రెండు చోట్ల డబుల్‌ మీనింగ్‌ వచ్చేలా మాట్లాడారు.

ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నిర్మించారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోంచి విడుదలైన కళావతి, పెన్నీ పాటలతోపాటు టైటిల్‌ సాంగ్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం వహించారు. ఇక మూవీలో మహేష్‌ లుక్‌, డైలాగ్స్, ఫైట్స్‌ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్‌ అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి