Dhanush : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో దేన్ని నమ్మాలో.. దేన్ని నమ్మవద్దో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అందులో వస్తున్న వార్తల్లో చాలా వరకు పుకార్లే ఉంటున్నాయి. అయితే కొన్ని వార్తలు మాత్రం నిజమే అవుతున్నాయి. కానీ 99 శాతం వరకు వార్తలు అన్నీ పుకార్లే అవుతున్నాయి. ఇక ఈమధ్యే ఓ వార్త కూడా ఇలాగే వైరల్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ఆమె మాజీ భర్త ధనుష్ మళ్లీ కలవబోతున్నారంటూ.. ఓ వార్త వైరల్ అయింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తేలింది.
ఓ మీడియా సంస్థ ఇదే విషయమై ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లను క్లారిటీ కోసం సంప్రదించిందట. దీంతో వారి మేనేజర్లు రిప్లై ఇచ్చారట. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని, విడాకులను రద్దు చేసుకుంటారని.. వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈ వార్తలను నమ్మొద్దని కోరారు. అయితే ధనుష్, ఐశ్వర్య ఈ మధ్య కలసి మాట్లాడుకున్న మాట వాస్తవమేనట. కానీ వారు కలిసింది.. పిల్లల భవిష్యత్తు గురించట. వారికి ఏం చేద్దామనే ఆలోచనలో భాగంగానే ఇద్దరూ కలసి మాట్లాడుకున్నారు తప్ప.. తాము కలసిపోయేందుకు వారు మాట్లాడుకోలేదట. అందువల్ల ఈ వార్తల్లో నిజం లేదని.. అంతా అబద్దమేనని తేలింది.
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు 2004లో వివాహం చేసుకోగా.. ఈ ఏడాది జనవరిలో తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపి షాకిచ్చారు. విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు. అందులో భాగంగానే వారు ఇప్పటికే విడాకులు కూడా తీసుకున్నారు. ఇక వారు కలిసే ప్రసక్తే లేదని వెల్లడించారు. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ తమ వంతు బాధ్యతలను తీసుకుంటామని మాత్రం చెప్పారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…