గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Deepika Padukone : ఎరుపు రంగు దుస్తుల్లో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌తులు పోగొడుతున్న దీపికా ప‌దుకొనె..

Deepika Padukone : ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా పండితులు ఎంతో ఇష్ట ప‌డే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఈ ఏడాది కూడా అలాగే అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం విదిత‌మే. మే 17న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వం మే 28వ…

Deepika Padukone : ఎరుపు రంగు దుస్తుల్లో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌తులు పోగొడుతున్న దీపికా ప‌దుకొనె..

Deepika Padukone : ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా పండితులు ఎంతో ఇష్ట ప‌డే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఈ ఏడాది కూడా అలాగే అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం విదిత‌మే. మే 17న ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వం మే 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు అవార్డుల‌ను కూడా ప్ర‌దానం చేయ‌నున్నారు. అయితే ఈ షోలో ప‌లువురు భార‌తీయ హీరోయిన్ల‌కు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో వారు కేన్స్ ఉత్స‌వంలో మెరిశారు. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే కూడా ఈ ఉత్స‌వంలో పాల్గొని అందాల విందు చేసింది.

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో భాగంగా దీపికా ప‌దుకొనె జ్యూరీ మెంబ‌ర్ గా కూడా ఉంది. అయితే ఈమె 3వ రోజు వేడుక‌కు ఎరుపు రంగు డ్రెస్‌లో హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ దీపిక ధ‌రించిన డ్రెస్ చూస్తుంటే యువ‌త‌కు పిచ్చెక్కిపోతోంది. ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం కొత్తేమీ కాదు.. కానీ ఇలాంటి డ్రెస్‌లో ఈమె మ‌రింత కొత్త‌గా క‌నిపిస్తోంది. ఇక దీపికా ప‌దుకొనెకు చెందిన ఈ లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Deepika Padukone attended Cannes film festival
Deepika Padukone

కాగా ఈ ఉత్స‌వంలో ఐశ్వ‌ర్యా రాయ్‌, హీనా ఖాన్ వంటి బాలీవుడ్ హీరోయిన్ల‌తోపాటు పూజా హెగ్డె, త‌మ‌న్నా తదిత‌ర టాలీవుడ్ బ్యూటీలు కూడా ఇప్ప‌టికే పాల్గొని సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలోనే వారి ఫొటోలు కూడా వైర‌ల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి