గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Daggubati Rana : తండ్రి కాబోతున్న రానా.. దగ్గుబాటి ఫ్యామిలీలో డబుల్ ధమాకా..!

Daggubati Rana : హీరోగా మాత్రమే కాదు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. కెరీర్ మొదట్లోనే తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా బాహుబలిలో…

Daggubati Rana : తండ్రి కాబోతున్న రానా.. దగ్గుబాటి ఫ్యామిలీలో డబుల్ ధమాకా..!

Daggubati Rana : హీరోగా మాత్రమే కాదు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. కెరీర్ మొదట్లోనే తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా బాహుబలిలో విలన్ రోల్ చేశాడు. ఇక సినిమా సినిమాకు తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నారు రానా. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో చేసిన విరాటపర్వంతో చివరిసారి ప్రేక్షకులను పలకరించాడు రానా. ఈ సినిమాలో ఆయన నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు.

ఇందులో రానా యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆయన పర్సనల్ విషయాలకొస్తే రానా, మిహికాలు ప్రేమించుకున్నారు. వీరు 2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అక్కినేని, మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. అతికొద్ది మంది మధ్య రానా వివాహం ఘనంగా నిర్వహించారు. రానా, మిహికాలు పెళ్లికి ముందే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రేక్షకులను అలరించేవారు. వీరికి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునేవారు. అయితే కొంతకాలం రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

Daggubati Rana going to become father
Daggubati Rana

ఇన్ స్ట్రాగ్రాంలోని తన ఫొటోలను డెలిట్ చేశారు. దీంతో రానా, మిహికాలు విడిపోతున్నారని కొందరు ప్రచారం చేశారు. సమంత, చైతూ కపుల్స్ మాదిరిగానే రానా కపుల్స్ విడాకులు తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఈ వార్తలకు రానా తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను తండ్రి కాబోతున్నట్లు మిహికాతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వారు విడిపోవడం లేదని తేల్చినట్లయింది. అలాగే విక్టరీ వెంకటేశ్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ అని అంటున్నారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఇంట్లో ఈ దీపావళికి డబుల్ ధమాకా సంబరాలు చేసుకున్నారని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి