Chiranjeevi Rajnikanth : ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి రోడ్ల‌పై తిరిగేవాళ్లు.. మందు కూడా పోశా..

October 19, 2021 10:29 PM

Chiranjeevi Rajnikanth : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన రాకేష్ మాస్ట‌ర్ ఈ మ‌ధ్య కాలంలో విమ‌ర్శ‌ల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతున్నాడు. దేవుళ్లు, సినిమాలు, సెల‌బ్రిటీల‌పై త‌ప్పుడు కామెంట్స్ చేస్తూ అంద‌రి ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Chiranjeevi Rajnikanth wandered on roads supplied drink to them says rakesh master

ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన రాకేష్ మాస్టర్ తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీ రామారావుని చూసేందుకు రైలు పట్టాలపై నడుచుకుంటూ చెన్నై వెళ్ళేవాడిని అని తెలిపారు. అప్పుడు చిరంజీవి, రజనీ కాంత్ రోడ్లపై తిరుగుతూ ఉండేవారని, అప్పుడు తాను వాళ్ళని పట్టించుకునే వాడిని కాదని ఆయన అన్నారు.

రజనీ కాంత్, శోభన్ బాబు తనతో చాలా క్లోజ్ గా ఉండేవారని అప్పుడ‌ప్పుడు తాను మందు కూడా పోసే వాడినని ఆయన అన్నారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి బట్టల షాప్ లో పెట్టారని ఆయన వివరించారు. ఆ సమయంలో తమిళుల చేత చాలా తిట్లు పడ్డానని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.

రాకేష్ కామెంట్స్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన రాకేష్ మాస్టర్ ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించారు. అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా ఆయన పాల్గొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now