Chiranjeevi : యాంకర్ అనసూయకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్.. కారణం అదేనా ?

March 15, 2022 9:26 PM

Chiranjeevi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి తనకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు అనసూయకు మెగాస్టార్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? ఇలా తనకి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.. అనే విషయానికి వస్తే..

Chiranjeevi given strong warning to Anasuya know why
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మళయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇందులో అనసూయ ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలలో చిక్కుకున్న అనసూయకు చిరంజీవి ప్రత్యర్థులు తన న్యూస్ ఛానల్ లో చిరంజీవి గురించి చెడుగా ప్రచారం చేస్తే తనని ఆదుకుంటామని చెబుతారు. తన ఛానల్ నడవడం కోసం అనసూయ.. చిరంజీవి పై దుష్ప్రచారం చేస్తుంది.

ఈ దుష్ప్రచారం కారణంగా చిరంజీవి ఏకంగా జైలుకు కూడా వెళ్తారు. కానీ చిరంజీవి ప్రత్యర్థులు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అనసూయని కూడా మోసం చేస్తారు. అయితే జైలు నుంచి బయటకువచ్చిన తర్వాత చిరంజీవి అనసూయకి ఉన్న ఆర్థిక కష్టాలను తీర్చడమే కాకుండా ఆ సమయంలో ఆమెకు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారు. ఇలా ఈ సినిమాలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మోహన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now