Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇప్పటికీ అభిమానులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన చిరు త్వరలో ఆచార్య అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కి వినాయక్ క్లాప్ కొట్టగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, బుచ్చిబాబు, హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇక చిత్రానికి సంబంధించి చిరంజీవి మాస్ లుక్ కూడా ఒకటి విడుదల చేయగా, ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ‘మాస్ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ఒకప్పుడు బిగ్ బాస్ తరహాలో మెగాస్టార్ కనిపిస్తున్నారు. గ్లాసెస్, స్టైల్ గా సిగరెట్ వెలిగించడం, మెడలో ఆ గొలుసు.. ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈ బడా ప్రాజెక్ట్ పై ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…