Chethana Raj : అందం కోసం స‌ర్జ‌రీ చేయించుకుంటే.. ప్రాణాలే పోయాయి..!

Chethana Raj : ప్ర‌స్తుత త‌రుణంలో అందం ప‌ట్ల చాలా మంది ఎంత శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. అందంగా క‌నిపించేందుకు కేవ‌లం స్త్రీలు మాత్ర‌మే కాదు.. పురుషులు కూడా తాప‌త్ర‌య ప‌డుతున్నారు. అందులో భాగంగానే బ‌రువు త‌గ్గించే శ‌స్త్ర చికిత్స‌ల‌తోపాటు ముఖం ఇత‌ర శరీర భాగాలు అందంగా క‌నిపించేందుకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే ఈ స‌ర్జ‌రీలు కుదిరితే బాగానే ఉంటాయి. కానీ కుద‌ర‌క‌పోతే ముఖం లేదా శ‌రీరం అంద విహీనంగా మారుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు పోతాయి కూడా. గ‌తంలో కొంద‌రు న‌టీన‌టుల‌కు ఇలాగే జ‌రిగింది. ఇక తాజాగా ఓ న‌టి కూడా ఇలాగే అందంగా క‌నిపించ‌డం కోసం ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంది. కానీ స‌ర్జ‌రీ విక‌టించి కొన్ని గంట‌ల్లోనే మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళితే..

క‌న్న‌డ టీవీ న‌టి చేత‌నా రాజ్ ఆ భాష‌లో ప‌లు సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల్లోనూ న‌టించింది. ఈమె వ‌య‌స్సు 21 ఏళ్లు. అయితే చేత‌నా చ‌ర్మం కింద ఉండే కొవ్వును క‌రిగించే ఫ్యాట్ ఫ్రీ కాస్మొటిక్ స‌ర్జ‌రీ చేయించుకుంది. అందుకుగాను ఆమె మే 16న బెంగ‌ళూరులోని శెట్టి సౌంద‌ర్య హాస్పిట‌ల్‌లో చేరింది. దీంతో ఆమెకు వైద్యులు స‌ర్జ‌రీ చేశారు. అయితే స‌ర్జ‌రీ మ‌ధ్యాహ్నం జ‌ర‌గ్గా సాయంత్రం వ‌ర‌కు ఆమె ఊపిరితిత్తుల్లోకి బాగా నీరు చేరింది. దీంతో ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైంది.

Chethana Raj

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు హాస్పిట‌ల్‌లో ఐసీయూ లేక ఆమెను స‌మీపంలోని మంజునాథ్ న‌గ‌ర్‌లో ఉన్న క‌డే హాస్పిట‌ల్‌కు అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌ల్లిదండ్రులు స‌ద‌రు శెట్టి సౌంద‌ర్య హాస్పిట‌ల్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. స‌రైన ప‌రిక‌రాలు లేకుండానే ఆమెకు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేశార‌ని.. క‌నుక‌నే స‌ర్జ‌రీ విక‌టించి త‌మ కుమార్తె చ‌నిపోయింద‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM