Charmy Kaur : 20 ఏళ్లుగా కూడ‌బెట్టిన ఆస్తి.. ఒక్క ఫ్లాప్‌తో మ‌టాష్‌.. ప్ర‌శ్నార్థ‌కంగా మారిన చార్మి భ‌విష్య‌త్తు..

August 28, 2022 11:11 AM

Charmy Kaur : ఈ ఆగస్టు 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లైగర్.  హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించ‌గా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

మొదటి రోజునే రూ.200 కోట్లు వసూలు చేస్తుందని సినిమా యూనిట్ చేసిన ప్రచారం కేవలం కలగానే మిగిలిపోయింది. లైగర్ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇంత డిజాస్టర్ టాక్ తో దారుణ‌మైన నెగెటివ్ కామెంట్స్ తో సోష‌ల్ మీడియాలో పూరీని ఏకేస్తున్నారు. లైగర్ చిత్రం పరాజయంతో పూరీ జగన్నాథ్ పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పూరీపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నందుకు ఛార్మి కూడా నిండా మునిగింది అనే వార్తలు తీవ్రంగా ప్రచారం అవుతున్నాయి.

Charmy Kaur lost 20 years of assets with one flop
Charmy Kaur

లైగర్ చిత్రం విడుదలైన మొదటి షోకే ఫలితం తెలియడంతో ఛార్మి తన సన్నిహితుల దగ్గర చాలా ఎమోషనల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్లు కష్టపడి కూడబెట్టుకున్న 200 కోట్ల రూపాయలు ఒక్కసారిగా లైగర్ చిత్రంతో నష్టపోయాను అని సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడటం జరిగిందట ఛార్మి. అంతే కాకుండా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్న జనగణమన చిత్రానికి కూడా ఛార్మి నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. లైగర్ చిత్రం డిజాస్టర్ తో ఈ ప్రభావం కాస్త జనగణమన చిత్రంపై పడే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనితో ఛార్మి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment