Chandramukhi : ఇది నిజంగా జ‌రిగిన రియ‌ల్ లైఫ్ స్టోరీ.. ఈ క‌థ‌నే చంద్ర‌ముఖిగా తీశారు..!

Chandramukhi : మనకు చంద్రముఖి అనగానే 2 విషయాలు గుర్తొస్తాయి.. 1. జ్యోతిక రా..రా.. 2. రజినీ లకలకలక… డైలాగ్స్.. రజినీకాంత్ మ్యానరిజానికి జ్యోతిక నటన, నయనతార గ్లామర్ తోడవడంతో చంద్రముఖి మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రియల్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం.. కేరళలోని అలా కుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ అది చూడగానే జమీందార్ల ఇల్లులా కనిపిస్తుంది. ఇది ట్రావెన్ కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమీందార్ ఇల్లు. అతనిది కూడా ట్రావెన్‌కోర్ వంశమే.

అలమోట్టిల్ మెద రాజు.. మహా క్రూరుడు.. అతని ఇంటి కింది భాగంలో చుట్టాలు మరియు ఇతర బంధువులు ఉండేవారు. పైన రాజు ఉండేవారు. బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్నూ కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు రాజు. అతని ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైన గదులు కూడా ఉండేవి. ఇక ఇంటికి కాస్త దూరంలో తన ఉంపుడుగత్తెల కోసం చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తన కోసం తీసుకువచ్చిన అందగత్తెలు కనిపించేలా అందులో ఉంచేవారు. వారిలో మంచి నాట్యకారులను పిలిచేవారు. వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతోపాటు సత్కారం కూడా చేసేవాడు.

Chandramukhi

అందాన్ని ఆస్వాదించడంలో ఆ రాజుది అందె వేసిన చేయి. ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడ పుట్టిందే. రాజు మంచి పాలనలో ఉన్నప్పుడు తన సోదరి కుటుంబం తన ఇంటికి వచ్చింది. ఇక తన అక్క బావ వారి పిల్లలను కూడా అదే ఆస్థానంలో ఉండమన్నాడు. ఇక రాజు యొక్క రాజభోగాలు సంపదను చూసి అక్క బావ కుళ్లుకున్నారు. ఆయన ఆస్తిపై కన్నేశారు. ఆయన ఆస్తుల్లో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని ఎన్నాళ్ళు ఇక్కడ ఉండమంటావ్ అని రాజుని అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు 1000 ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు.

కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక తన అక్క బావ పిల్లలు కూడా పెద్దవారయ్యారు. రాజుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే రాజు వయసు మీద పడుతుండటంతో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది. కానీ రాజు తన ఆస్థాన అధికారులను పిలిపించి తన ఆస్తులను కొడుకులకు, కూతుళ్ళకు రాసిచ్చాడు. దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు. ఎన్నాళ్లనుంచో కాచుకుని కూర్చున్న తన అక్కకు ఆస్తి దక్కలేదు.. దీంతో రాజును చంపేయాలనుకున్నారు. మొదట రాజు భార్యకు స్లో పాయిజన్ ఇచ్చి చంపారు.

ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్నచిన్న ముక్కలుగా చేసి, వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆమె కూడా రోజు తాగేది. దీంతో 3 నెలల తర్వాత మంచానపడి ఆమె చనిపోయింది. దీంతో రాజు ఒంటరివాడయ్యాడు. తనకు తోడు ఎవరు లేకపోవడంతో తన సేవకుడి 18ఏళ్ల కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది. కానీ ఓ రోజు ఒక కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు. అప్పుడు రాజుతో పాటు తన పని మనిషి బొమ్మ కూడా వేయమన్నాడు రాజు.

రాజు బొమ్మను 2 రోజుల్లో వేశాడు కానీ ఆ పని మనిషి బొమ్మ వేయడానికి వారం రోజులు టైం తీసుకున్నాడు కళాకారుడు. తర్వాత పని మనిషి బొమ్మను అందంగా తీర్చి దిద్దాడు.. ఆ బొమ్మని చూసిన రాజుకు పనిమనిషిపై మనసు పడింది. ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పనిమనిషిపై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది. తన గేమ్ స్టార్ట్ చేసింది. అంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది.

అనుకున్నట్టుగానే ఒక గదిలో రాజును, ఆ పని మనిషిని చంపేసింది.. వారి నగలు డబ్బు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది. ఆ తర్వాత రాజును చంపిన గది తప్ప, ఆ కోటను మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిం.. అయితే ఆ రాజు కొడుకు కూడా ఒక సేవకున్ని ఆ ఆస్థానంలో ఉంచాడు. ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి క్రూర శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు. తర్వాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి ఆ సేవకుడు కూడా పారిపోయాడు.

చివరికి తన అక్కే ఆ ఇంట్లో ఉంది. మళ్లీ అమావాస్య రానే వచ్చింది. ఆరోజు రాత్రి తన అక్క కూతురు ఇంట్లో ఉండగానే ఆ పని మనిషి ఆత్మ తన కూతురును ఆవహించింది. అచ్చం పని మనిషి లాగా మాట్లాడుతూ ఆమె కూతురే ఆ రాజు అక్కను చంపేసింది. ఈ విధంగా ఆ కోట నుంచి ప్రతి అమావాస్య రోజున శబ్దాలు రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొనే చంద్రముఖి సినిమాను తెరకెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM