Business Idea : ఈ బిజినెస్ చేస్తే త‌క్కువ పెట్టుబ‌డి.. నెలకు రూ.1 లక్ష ఆదాయం పొంద‌వ‌చ్చు..

October 17, 2022 11:11 AM

Business Idea : సంప్రదాయ పంటలతో రైతులకు పెద్దగా లాభాలు రావడం లేదు. పైగా భారతదేశ వ్యవసాయం వర్షాధారితం కావడంతో నష్టాలు తప్పడం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా కొంతమంది రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎక్కువమంది నర్సరీల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో షేడ్ నెట్లు ఏర్పాటు చేసి కూరగాయల నారును పెంచుతూ రైతుల అవసరాలు తీరుస్తున్నారు. కూరగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు సిద్ధం చేసుకునేవారు.

ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక పాడైపోయేవి. ప్రస్తుతం ఈ నర్సరీలు వచ్చాక రైతులకు మేలు జరుగుతోంది. ఒక ఎకరా విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేస్తే రూ 90 వేల వరకు ఖర్చు అవుతుండగా సీజన్లో నెలకు రూ.50 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా టమాటా, వంకాయ, క్యాబేజీ, మిరప నారును పెంచుతున్నారు. టమాటా, క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ విత్తనాలు మొలకెత్తడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుండగా.. పొలాల్లో నాటేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. మిరప వంకాయ 25 రోజుల నుంచి 30 రోజులకు అందుబాటులోకి వస్తాయి.

Business Idea you can get rs 1 lakh per month with vegetable nursery
Business Idea

కల్తీ విత్తనాల ద్వారా నారు, నాణ్యత లేని నారు పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నర్సరీ యాక్టును తీసుకువచ్చింది. నిర్వాహకులు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యువ రైతు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సరీలో అన్ని రకాల కూరగాయల నారును పెంచుతున్నాం. రైతుల అవసరాల మేరకు పూర్తిస్థాయిలో నారును అందుబాటులో ఉంచి, తక్కువ ధరకే అందిస్తున్నాం. నర్సరీ ద్వారా నేను ఉపాధి పొందడమే కాకుండా, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను అని తెలిపాడు. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్లోనే 21 నర్సరీలున్నాయి. ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలను విధించింది. ప్రతీ నిర్వాహకుడు వాటికి అనుగుణంగానే నర్సరీలను నడపాలని ఉద్యానవనశాఖ అధికారి స్వాతి తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now