Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే కు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
అయితే అదే రోజు దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ ల సీతారామం కూడా విడుదలైంది. రష్మిక మందనా.. ఆఫ్రీన్ అనే కీ రోల్‌లో కనిపించింది. వీరి ప్రేమకథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1960లలో జరిగిన ఓ క్లాసికల్ లవ్ స్టోరీగా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో కూడా సీతారామం దూసుకుపోయింది.
థియేటర్స్ లో అలరించిన ఈ రెండు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. బింబిసార ఓటీటీ హక్కులని జీ5.. సీతారామం హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలని సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న ఈ రెండు చిత్రాలు 5 వారాల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోనున్నాయి. కాబట్టి తాజా నిబంధనల ప్రకారం ఓటీటీ రిలీజ్ కి అదే సరైన టైం అని మేకర్స్ భావిస్తున్నారు. కనుక అదే తేదీ రోజు ఈ మూవీలను ఆయా యాప్‌లు రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…