Bigg Boss OTT Telugu : బుల్లితెరపై బిగ్ బాస్ 5 తెలుగు ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌కు మొదట్లో పెద్దగా రేటింగ్స్ రాలేదు కానీ.. రాను రాను షోలో రొమాన్స్ ఎక్కువ అవడం కారణం వల్ల రేటింగ్స్ తరువాత రోజుల్లో పెరిగిపోయాయి. ఓ దశలో షోను కొందరు విమర్శించారు కూడా. షోలో మరీ రొమాన్స్ ఎక్కువైందని చాలా మంది విమర్శలు చేశారు.
అయితే విమర్శలను సైతం తట్టుకుని బిగ్ బాస్ 5 తెలుగు ఎట్టకేలకు విజయవంతంగా ముగిసింది. ఈ క్రమంలోనే ఈ షోకు లభించిన ఆదరణ దృష్ట్యా త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ని కూడా ప్రారంభిస్తామని, దానికి తానే స్వయంగా గెస్ట్‌గా ఉంటానని కూడా నాగార్జున తెలిపారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి ఒక అప్‌డేట్ తెలుస్తోంది. ఈ షోను ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రసారం చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లను కూడా ఇప్పటికే ఎంపిక చేశారని సమాచారం. త్వరలో వారిని క్వారంటైన్‌కు తరలిస్తారని తెలుస్తోంది.
కాగా బిగ్ బాస్ ఓటీటీ 82 రోజుల పాటు రోజుకు 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గతంలో షో రోజుకు 1 గంట నుంచి 2 గంటల మేర మాత్రమే ప్రసారం అయ్యేది. కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతో రోజంతా ప్రేక్షకులకు వినోదం లభ్యం కానుంది.
హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ హిట్ అయిన దృష్ట్యా తెలుగులోనూ దాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ షో 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కనుక దీని పట్ల ప్రేక్షకులు అంతగా ఆసక్తిని చూపిస్తారా.. లేదా.. అన్నది సందేహంగా మారింది. ఆ విషయం తెలియాలంటే ఫిబ్రవరి చివరి వారం వరకు ఆగాల్సిందే..!
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…