Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుండగా, ఎట్టకేలకు దీనిని ముగించాడు బిగ్ బాస్ . అయితే షో మొదట్లో రవి తాను కాజల్ దగ్గర తీసుకున్నడబ్బు తిరిగి ఇచ్చేశాడు. దీంతో కాజల్.. నువ్వేనా నొక్కేసింది.. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందా.. అని సందేహం వ్యక్తం చేసింది. దీంతో రవి.. సీక్రెట్ టాస్క్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వను కదా మేడమ్ అని అన్నాడు.
షణ్ముఖ్ పాట పాడుతూ తన వెనుక తిరగాలని ఆర్డర్ వేసింది సిరి. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే అని పాడ పాడటంతో సిరి వయ్యారాలు ఒలకబోస్తూ స్టైల్‌గా నడిచింది. ఆమె ఓవరాక్షన్ చూసి ప్రేక్షకులకి పిచ్చెక్కిపోయింది. ఇక సన్నీ అయితే ఏకంగా అనీ మాస్టర్ గుర్రం ఎక్కాడు. ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం.. అంటూ సన్నీని గుర్రం ఎక్కించుకుని తెగ తిప్పేసింది అనీ మాస్టర్. ఈ ఘోరం చూసి అందరూ తిట్టుకుంటున్నారు.
ఇక షణ్ముఖ్ అయితే కాజల్‌పై ఫన్నీ కవిత చెప్పి తెగ నవ్వించాడు.. అదిగో అదిగో గోడ.. ఇదిగో ఇదిగో నీడ.. నీడలో ఉంది దూడ.. దూడ వేసింది పేడ.. పేడతో చేశాం పిడక.. పిడకతో వేశాం మంట.. మంటతో చేశాం వంట.. అంటూ కాజల్‌పై కవిత అందుకున్నాడు షణ్ముఖ్. నీ కవిత కొత్తగా కాదు చెత్తగా ఉందంటూ గాలి తీసేసింది కాజల్. రవి మాత్రం దూరం నుంచి చూస్తే చందమామ.. దక్కరకెళ్లి చూస్తే మన కాజల్ మామ.. అంటూ ఆమెను బుట్టలో పెట్టి వంద పట్టేశాడు.
షణ్ముఖ్ ప్రెస్టీజ్ చాంపియన్ ఆఫ్ ది వీక్‌గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్ వోచర్ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. అతిథుల టీమ్‌లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్, పింకీలపై వేటు వేశారు. దీంతో సిరి, కాజల్, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి ‘టవర్‌లో ఉంది పవర్’ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో పోటీదారులు టవర్ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి. హౌజ్‌మేట్స్ మద్దతుతో రవి కెప్టెన్‌గా గెలిచాడు.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…