Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చివరి కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నియంత మాటే శాసనం అనే గేమ్ ఇవ్వగా ఇందులో చివరకు రవి, షణ్ముఖ్, ప్రియాంక మిగిలారు. అయితే చివరి బజర్‌కు నియంత స్థానాన్ని షణ్ముఖ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రియాంక, రవిలలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా, తాను ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ కోరింది.
గేమ్ నుండి తొలగించొద్దంటూ షణ్నుని బ్రతిమలాడింది. అయినా కూడా ఏ మాత్రం కరగని షణ్ను తను రవి కోసం ఏం చేయలేదంటూ ప్రియాంకని తొలగించి రవికి అవకాశం ఇచ్చాడు. ఈ గొడవతో ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్ హాల్‌లోకి వెళ్లి ఏడ్చేసింది. ఫైనల్‌గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్‌లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు.
బీబీ ఎక్స్‌ప్రెస్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతోపాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అందరూ వినోదాన్ని పంచారు. అందరూ పాజ్‌లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయింది.
గెలవకపోయినా కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది కూతురు. మమ్మీనెవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తుందా ? అని శ్రీరామ్ అడగ్గా కాజల్ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, అనీ మాస్టర్‌నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్ జోక్ చేశానని కవర్ చేసింది. మొత్తానికి కాజల్ కూతురు ఉన్నంత సేపు హౌజ్‌లో తెగ సందడి చేసి వెళ్లిపోయింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…