Bigg Boss 5 : బిగ్ బాస్‌లో ప్రతి ఏడాది కొన్ని గ్రూపులు ఏర్పడడం సహజం. గ్రూపులుగా ఆడి కొద్ది మంది గెలిచారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో జెస్సీ, సిరి, షణ్ముఖ్ ఓ గ్యాంగ్ కాగా, ఇందులో జస్వంత్ బయటకు వెళ్లడంతో రవి ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాజల్, మానస్, సన్నీ ఓ గ్రూప్‌గా ఏర్పడి గేమ్ ఆడుతున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో రోజురోజుకీ లెక్కలు మారిపోతున్నాయి.
శనివారం సన్నీది బ్యాడ్ బిహేవియర్ అని రవి కామెంట్ చేశాడు. దీనిని సన్నీ ఏ మాత్రం తీసుకోలేకపోతున్నాడు. ఛాన్స్ వస్తే రవితో గొడవకు దిగుతున్నాడు సన్నీ. అయితే రవి తనకు వచ్చిన పవర్‌ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్‌బాస్‌కు చెప్పాడు. కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్‌ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా అయిష్టంగానే సన్నీ ఓకే చెప్పాడు.
రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌తోపాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసినట్టు తెలుస్తోంది. ఈ సారి కెప్టెన్ అయ్యే అవకాశాన్ని మానస్ అందుకున్నాడని లీకు వీరుల ద్వారా తెలుస్తోంది.
పది వారాల తర్వాత మానస్ కెప్టెన్ అయినందుకు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మానస్ కెప్టెన్ అయితే సన్నీ రేషన్ మేనేజర్ అవుతాడేమోనని ఊహిస్తున్నారు. అయితే గత శనివారం నుండి సన్నీపై అందరూ దాడికి దిగుతుండడం అభిమానులని కలవరపరుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…