Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలెకి ఇంకా 3 వారాల సమయం మాత్రమే ఉంది. బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం 7 మంది సభ్యులు ఉన్నారు. చివరి వారం యాంకర్ రవి ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. వాస్తవానికి యాంకర్ రవి మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. టాప్ 5లో ఉండడం ఖాయమని అందరూ భావించారు. కానీ అతని ఎలిమినేషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.
బిగ్ బాస్ ఇంటి నుంచి రవిని ఎలిమినేట్ చేయడం అన్యాయమని అతని ఫ్యాన్సే కాదు, ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదని, పూర్తిగా అన్యాయంగా రవిని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రవి బిగ్ బాస్ ఇంట్లోకి మళ్లీ ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.
యాంకర్ రవి ఎలిమినేషన్ తరువాత అతని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళన చేపట్టారు. రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే రవిని తిరిగి ఇంట్లోకి ప్రవేశపెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక స్టార్ మా కూడా రవిని తిరిగి తీసుకురావాలనే ఆలోచిస్తున్నదట. రవిని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేశాక.. స్టార్ మా మాత్రమే కాక.. అటు నాగార్జున కూడా అప్రతిష్టను మూటగట్టుకున్నారని.. చాలా మంది బహిరంగంగానే విమర్శించారు.
రవి ఎలిమినేషన్‌కు ముందు వాస్తవానికి ఆర్‌జే కాజల్ కూడా డేంజర్ జోన్‌లో ఉంది. అంతకు ముందు వారాల్లో అనారోగ్యంతో జెస్సీ ఎలిమినేట్ అవగా.. కాజల్ సేవ్ అయ్యింది. అయితే కాజల్ అప్పటి నుంచి డేంజర్ జోన్‌లోనే ఉంది. అలాంటిది ఆమెను కాకుండా రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. రవికి ఓట్లు కూడా ఎక్కువగానే వచ్చాయి. దీంతో అతని ఎలిమినేషన్ కరెక్ట్ కాదని చాలా మంది అన్నారు.
ఇక సన్నీ తన వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను కాజల్‌ను సేవ్ చేసేందుకు ఉపయోగించాడు. ఈ క్రమంలో రవి వెనుకబడినట్లు చెప్పారు. అయితే రవి బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో మళ్లీ వస్తాడని అంటున్నారు. కానీ దీనిపై అధికారిక సమాచారం లేదు. అయితే ఫినాలె దగ్గర పడుతున్న ఈ సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితేనే రవి రీ ఎంట్రీ సాధ్యపడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…