గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bhumika : ఆ విధంగా చేస్తే త‌ప్ప‌.. మంచి పాత్ర‌లు ఇవ్వ‌రా ? భూమిక కామెంట్స్‌..!

Bhumika : టాలీవుడ్ స్టార్ నటి భూమిక చావ్లా గురించి అందరికీ పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ…

Bhumika : ఆ విధంగా చేస్తే త‌ప్ప‌.. మంచి పాత్ర‌లు ఇవ్వ‌రా ?  భూమిక కామెంట్స్‌..!

Bhumika : టాలీవుడ్ స్టార్ నటి భూమిక చావ్లా గురించి అందరికీ పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ విషయంపై ఆమె స్పందించింది.

Bhumika comments on her characters in movies

తొలిసారిగా యువకుడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలిసారి నటనతోనే మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

భూమిక తన పెళ్లి తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ క్యారెక్టర్‌కు గుడ్‌బై చెప్పి సహాయ పాత్రలలో నటిస్తోంది. కానీ సరైన పాత్ర ఆమెకు దొరకడం లేదని.. దీనికి కారణం ఆమె సెలెబ్రెటీలతో ఎక్కువగా పార్టీలకు వెళ్లదని.. వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. పార్టీలకు వెళితే తప్ప మంచి పాత్ర రాదా.. అంటూ.. అలాంటి మాటలను ఎంకరేజ్ చేయనని తెలిపింది. ఫిల్మ్ మేకర్స్ తో రోజూ టచ్ లో ఉంటే అవకాశాలు వస్తాయనేది.. కేవలం భ్రమ మాత్రమే అంటూ.. తనకోసమే పాత్రలు రాసి.. తన కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలా మంది ఉన్నారని.. తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి