గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bhimla Nayak : వెన‌క్కు త‌గ్గ‌ని భీమ్లా నాయ‌క్.. సంక్రాంతి బ‌రికి సిద్ధ‌మంటున్న ప‌వ‌ర్ స్టార్..!

Bhimla Nayak : వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే…

Bhimla Nayak : వెన‌క్కు త‌గ్గ‌ని భీమ్లా నాయ‌క్.. సంక్రాంతి బ‌రికి సిద్ధ‌మంటున్న ప‌వ‌ర్ స్టార్..!

Bhimla Nayak : వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ప‌లు మార్పుల‌తో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Bhimla Nayak  to release on scheduled date no post pone

ఆర్ఆర్ఆర్ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుదల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌క‌ట‌నతో మ‌హేష్ బాబు వంటి స్టార్ హీరో వెన‌క్కు త‌గ్గాడు. త‌న సినిమాను ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

ఇక జ‌న‌వరి 12న విడుద‌ల కావ‌ల్సిన భీమ్లా నాయ‌క్ చిత్రం కూడా వాయిదా ప‌డుతుంద‌ని అన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన విడుదల కానుందని చెప్పుకొచ్చారు. కానీ భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ క‌న్‌ఫాం చేశారు.

ముందుగా చెప్పిన తేదీకే అంటే జ‌న‌వ‌రి 12నే మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్టు స్ప‌ష్టం చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

లాలా.. భీమ్లా.. అంటూ సాగే పాటను త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుద‌ల చేయ‌గా, ఇది కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి