Bhimla Nayak : భీమ్లా నాయక్ కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎన్ని కోట్లో తెలుసా?

October 22, 2021 2:38 PM

Bhimla Nayak : సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న  సినిమా భీమ్లా నాయక్. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bhimla Nayak got huge offer from amazon for rs 150 crores

ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేస్తే ఏకంగా రూ.150 కోట్లు చెల్లించనున్నట్లు అమెజాన్ ఈ సినిమాకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ సినిమాను థియేటర్‌లల విడుదల చేస్తే ఎంతో ఈజీగా 100 కోట్ల షేర్ల ను వసూలు చేస్తుంది. కానీ అమెజాన్ ఏకంగా రూ.150 కోట్లు ప్రకటించడం గమనార్హం.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. అయితే అదే సమయంలో రాజమౌళి RRR విడుదల కావడంతో ఈ సినిమాను పోటీగా సంక్రాంతి బరిలోకి దింపుతారా ? లేకపోతే విడుదల తేదీని వాయిదా వేసుకుంటారా ? ఇవి రెండూ కాకుండా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment