Bhimla Nayak : యూట్యూబ్‌లో రికార్డుల‌ను సృష్టిస్తున్న భీమ్లా నాయ‌క్ అడ‌వి త‌ల్లి పాట‌.. ఈ పాట పాడిన ఈమె ఎవ‌రో తెలుసా..?

December 5, 2021 7:18 AM

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. దీనికి సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌గ్గుబాటి రానా మ‌రో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన అయ్యప్ప‌నుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. భీమ్లానాయ‌క్‌లో నిత్యామీన‌న్ ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

భీమ్లానాయ‌క్ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, గ్లింప్స్‌, పాట‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. కాగా తాజాగా విడుద‌లైన అడ‌వి త‌ల్లి మాట అనే పాట కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట విడుద‌లైన కొద్ది గంట‌ల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డుల‌ను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మంది ఈ పాట‌ను వీక్షించారు.

Bhimla Nayak adavai thalli maata songs creating sensation do you know the singer of this song

ఈ పాట‌ను ఫోక్ సింగ‌ర్ కుమ్మ‌రి దుర్గ‌వ్వ‌, సాహితి చాగంటి క‌లిసి పాడారు. ఈ పాట‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే అస‌లు ఈ దుర్గ‌వ్వ ఎవ‌రు.. అని ఫ్యాన్స్ ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు.

కాగా దుర్గవ్వ మంచిర్యాల జిల్లా వాసి. పెద్ద‌గా ఏమీ చ‌దువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. దుర్గవ్వ కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ అనేక పాటలు పాడారు.

తెలుగులో దుర్గవ్వ పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే.. అనే పాట ల‌క్ష‌ల‌ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండ్ అవుతోంది. దీంతోపాటు సిరిసిల్లా చిన్నది లాంటి పాపులర్ పాటల‌ను ఆమె పాడి ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం భీమ్లా నాయక్ సినిమాలో దుర్గవ్వ పాడిన అడవి తల్లి మాట.. అనే పాట ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఈ పాట‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే 40 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను సాధించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment