Balakrishna : బింబిసార చిత్రాన్ని చూసిన బాల‌య్య‌.. ఏం అన్నారో తెలుసా..?

Balakrishna : ఈ ఆగస్ట్ 5 న బింబిసార చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై యువ దర్శకుడు వశిష్ట‌ కళ్యాణ్ రామ్ హీరోగా  ప్రేక్షకుల ముందుకు ఒక అద్భుతమైన కథను తీసుకువచ్చారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. టైం ట్రావెల్, ఫాంటసీ ఫిల్మ్ గా బింబిసార థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పవర్ ఫుల్ కథాంశంతో దర్శకుడు వశిష్ట కళ్యాణ్ రామ్ కి అద్భుతమైన సక్సెస్ ని అందించారు.

సినిమా మొదలైన వారం రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుండి కూడా బింబిసార చిత్రానికి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. బింబిసార చిత్రం సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ చిత్ర యూనిట్ ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంపై మంచి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

Balakrishna

తాజాగా నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. బింబిసార చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కి గానీ, ఎంఎం కీరవాణి అందించిన సంగీతం గానీ ఎంతో అద్భుతంగా ఉంది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చిత్ర యూనిట్ ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.

తొలిసారిగా చక్రవర్తిగా నటించిన కళ్యాణ్ రామ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బాలకృష్ణ కూడా బింబిసార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక చిత్రం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంకో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు క‌ల్యాణ్ రామ్ కూడా బింబిసార 2 ను అనౌన్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM