Balakrishna : నందమూరి బాలకృష్ణ మొట్ట మొదటి సారిగా ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ద్వారా సందడి చేశారు. ఈ షోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. షోకు చెందిన ఎపిసోడ్ ప్రోమోలు విడుదల చేయగానే ట్రెండింగ్ గా మారాయి. బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్‌పై ఏ విధంగా యాక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. కానీ టాక్ షో ద్వారా బుల్లి తెరపై ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తారోనని ఆడియెన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
అయితే అంచనాలకు తగిన విధంగానే మొదటి ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు. మంచు మోహన్ బాబు, లక్ష్మి, విష్ణులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ, మోహన్‌బాబు.. పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఇంకా ఏదో తగ్గినట్లు అనిపిస్తోందని.. ఫ్యాన్స్ అంటున్నారు.
టాక్ షోలలో చూసేందుకు ఏముంటుంది. సెలబ్రిటీలకు చెందిన వ్యక్తిగత జీవితాల గురించి చర్చించుకుంటారు. సహజంగానే ఆడియెన్స్‌కు ఆ విషయాలు అంటే ఆసక్తి ఉంటుంది. కనుక ఎలాగూ చూస్తారు. అయితే బాలయ్య షో నుంచి ఆడియన్స్ ఇంకాస్త ఫన్, జోష్‌ను ఆశించినట్లు తెలుస్తోంది.
అయితే షో ప్రారంభమైంది ఇప్పుడే కనుక.. రెగ్యులర్ టాక్ షో కాకుండా ఇంకా కొద్దిగా ఫన్, జోష్ ఉంటే.. రేటింగ్స్ ను బాగానే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కనుక నిర్వాహకులు ఆ దిశగా ప్రయత్నం చేస్తే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి బాలయ్య రానున్న ఎపిసోడ్స్‌లో ఇంకాస్త జోష్ పెంచుతారో, లేదో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…