Balakrishna : నందమూరి బాలకృష్ణకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే అసలు నమ్మలేరు..!

November 30, 2022 6:55 PM

Balakrishna : బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్ప‌టికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బ్లాక్‌ బస్టర్ ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లను అందుకున్నారు. సింహా, లెజెండ్‌, అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు బాలయ్య. ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి  తన తండ్రి స్థాపించిన పార్టీలో కొన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో నెగ్గిన బాలకృష్ణ ఫ్యామిలీ పేరిట మొత్తం 365 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

బాలయ్యకు నాలుగు వందల గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఆయన భార్య వసుంధర వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి, తన కొడుకు దగ్గర 220 గ్రాముల బంగారం, 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఇలా బాలయ్య ఆస్తి విలువ మొత్తం రూ.325  కోట్ల వరకు ఉంటుంది. వ్యక్తిగతంగా బాలయ్యకు 169కోట్లు, భార్య వసుంధర పేరిట 125కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు. ఇక బాలకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏడెకరాల వ్యవసాయ భూమి, షేర్ లింగంపల్లిలో రెండెకరాల భూమి ఉందని సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా రాయదుర్గం మండలం పవన్ మక్తాలో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్, మాదాపూర్ లో 940చదరపు అడుగుల ఫ్లాట్స్ బాలకృష్ణకు ఉన్నాయట.

Balakrishna total net worth properties and assets value
Balakrishna

ఇవేకాకుండా రామకృష్ణ స్టూడియోలో వాటా, హెరిటేజ్ ఫుడ్స్ లో ఆరువేలు పైగా షేర్స్, ఇన్నోటేక్ ప్రయివేట్ లిమిటెడ్ లో 49శాతం వాటా ఉన్నాయట. ఇక రిలయన్స్ సమస్థలో కూడా షేర్స్ ఉన్నట్లు బాలయ్య బాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు . అంతే కాకుండా కోటి విలువ చేసే ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. ఈ లెక్క ప్రకారం బాలయ్య ఆస్తి చాలానే ఉంటుందని సమాచారం వెళ్లడవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now