Balakrishna : పుష్పరాజ్‌.. తగ్గేదేలే.. డైలాగ్‌ చెప్పిన బాలయ్య.. అదిరిపోయిందిగా..!

December 25, 2021 10:11 AM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షోలో అద‌ర‌గొడ‌తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సెల‌బ్స్ హాజ‌రు కాగా, వారితో బాల‌య్య చేసే ఫ‌న్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ టైం వ‌చ్చింది. బాల‌య్య‌తో బ‌న్నీ చేసే సంద‌డి పీక్స్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య హోస్ట్​ చేస్తున్న ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ షోకు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Balakrishna told pushpa raj dialogue its wonderful

‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ కలిసి ఈ షో లో సందడి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలతోపాటు అతిథులుగా విచ్చేసిన వారిపై ఉన్న రూమర్ల గురించి స్పష్టత ఇచ్చారు. ‘పుష్ప’ సినిమా దర్శకుడు సుకుమార్, హీరోయిన్‌ రష్మిక కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోమో చివర్లో అల్లు అర్జున్ స్టైల్ లో బాలయ్య నడుస్తూ వచ్చి.. “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫైర్.. తగ్గేదేలే” అనే డైలాగ్ ను చెప్పడంతో అంద‌రూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

క్రిస్మ‌స్ కానుక‌గా నేడు ఈ షో ప్రీమియ‌ర్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మూడు పేజీల డైలాగులైనా బాలయ్యలా చెప్పడం అందరికీ సాధ్యం కాదని చెప్పి బాలయ్య అభిమానుల మెప్పు పొందారు బ‌న్నీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment