Balakrishna : తార‌క‌ర‌త్న చెవిలో బాల‌య్య మృత్యుంజ‌య మంత్రం చ‌ద‌వ‌డం వ‌ల్ల‌నే గుండె కొట్టుకుంటుందా..?

February 1, 2023 9:54 AM

Balakrishna : యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో పాల్గొన్న తార‌క‌ర‌త్న గుండెపోటుకి గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆసుప‌త్రిలో చేరిన ద‌గ్గ‌ర నుండి నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అయితే కుప్పంలో తారక రత్న కుప్పకూలిన సమయం నుంచి బెంగళూరు వెళ్ళే వరకు… ఇప్పుడు ఈ క్షణం వరకు కన్న కుమారుడి కంటే ఎక్కువగా, కంటికి రెప్పలా నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నారు.

వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలానే అటు కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు అప్ టు డేట్… అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే బాల‌య్య .. తార‌క‌ర‌త్న చెవిలో మృత్యుంజ‌య హోమం చ‌దివాడ‌ని అందుకే ఆ గుండె కొట్టుకుంటుంద‌ని నిర్మాత ప్ర‌సన్న కుమార్ చెప్పుకొచ్చాడు. మీడియాతో మాట్లాడారు తుమ్మల ప్రసన్నకుమార్… తారకరత్న కోలుకుంటున్నారు…కాళ్ళు , చేతులు కదుపుతున్నారన్నారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారు.

Balakrishna told mruthyunjaya mantram in taraka ratna ear
Balakrishna

కుప్పంలో తార‌క‌ర‌త్న గుండె దాదాపు 45 నిమిషాలు గుండె ఆగిందని తెలిపారు. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడు…మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నాడు..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని తెలిపారు. రోజు రోజుకీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, వైద్య చికిత్సకు ఆయన స్పందించడంతో పాటు కోలుకుంటున్నారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్ళి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ క్ర‌మ‌క్ర‌మంగా కోలుకుంటున్నారని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now