గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Balakrishna : ఎన్టీఆర్ త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చంద్ర‌బాబుకి ఎందుకిచ్చార‌న్న ప్ర‌శ్న‌కు బాల‌య్య స‌మాధానం ఇదే..!

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తొలిసారి ఆహా కోసం హోస్ట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో ఇటు బాల‌కృష్ణ, అటు మోహ‌న్ బాబు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు అభిమానుల‌లో…

Balakrishna : ఎన్టీఆర్ త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చంద్ర‌బాబుకి ఎందుకిచ్చార‌న్న ప్ర‌శ్న‌కు బాల‌య్య స‌మాధానం ఇదే..!

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తొలిసారి ఆహా కోసం హోస్ట్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో ఇటు బాల‌కృష్ణ, అటు మోహ‌న్ బాబు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు అభిమానుల‌లో అనేక ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మోహ‌న్ బాబు.. బాల‌య్య‌ని ఎన్టీఆర్‌ తర్వాత మీరెందుకు తెదేపా పగ్గాలు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు.

Balakrishna replied to mohan babu question why he did not take tdp after ntr

మోహ‌న్ బాబు ప్ర‌శ్న‌కి స్పందించిన బాల‌కృష్ణ‌.. మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి అతీతంగా.. పెద్దాయన తరువాత మేము తీసుకుంటే ఇంక దానికి అర్థం ఏం ఉంటుంది. చంద్రబాబు చాలా కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుండి అన్నీ చూసి వచ్చిన మనిషి. ఆయన కాబట్టే ఆ బాధ్యతలను అలా చేయగలిగాడు. అన్నగారి ఆశయాలను ముందుకి తీసుకెళ్ల గలిగాడు.. అంటూ బాల‌య్య స‌మాధానం ఇచ్చారు.

మీరు నటించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని బాలకృష్ణ అడిగితే, ‘‘పటాలం పాండు’ చేసిన తర్వాత నా భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదు’’ అని చెప్పారు. తన బ్యానర్‌లో వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అయితే, మహాబలిపురంలో భూములు అమ్మి అందరికీ డబ్బులు చెల్లించినట్లు మోహన్‌బాబు తెలిపారు. ఆ తర్వాత ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘పెదరాయుడు’ వరుస విజయాలతో నిలబడ్డానని వివరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి