గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Balakrishna NTR : నందమూరి ఫ్యాన్స్‌కు కిక్‌ ఎక్కించే వార్త..!

Balakrishna NTR : సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి నటసింహం బాలయ్యకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒకే…

Balakrishna NTR : నందమూరి ఫ్యాన్స్‌కు కిక్‌ ఎక్కించే వార్త..!

Balakrishna NTR : సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి నటసింహం బాలయ్యకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒకే కుటుంబంలోని హీరోలు మల్టీస్టారర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఆ అవకాశాన్ని నందమూరి హీరోలు వారి అభిమానులకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంతవరకు బాలకృష్ణ, ఎన్టీఆర్ కలసి ఏ సినిమాలోనూ నటించలేదు.

Balakrishna NTR to appear on stage for akhanda pre release event

అయితే వీరిద్దరూ పలు సందర్భాలలో ఒకే వేదికపై సందడి చేశారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా చేయాలని చిత్రబృందం భావించిందట. ఈ క్రమంలోనే ఈ వేడుకకు బాలకృష్ణ స్వయంగా ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ సందడి చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు అభిమానించే ఇద్దరు హీరోలూ ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో నందమూరి అభిమానులు ఆ దృశ్యాన్ని చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 2వ తేదీన బాలకృష్ణ సినిమా విడుదల కానుండగా జనవరి 7వ తేదీన ఎన్టీఆర్ సినిమా విడుదల కానుంది. దీంతో నందమూరి అభిమానులకు నిజంగానే ఇదొక పండగ వాతావరణం అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి