గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Balakrishna : బాల‌కృష్ణ ఇంటిపై దాడి.. షాక్‌లో అభిమానులు..

Balakrishna : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం తారాస్థాయికి చేరుకుంది. భౌతిక దాడుల‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇదే సమయంలో…

Balakrishna : బాల‌కృష్ణ ఇంటిపై దాడి.. షాక్‌లో అభిమానులు..

Balakrishna : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం తారాస్థాయికి చేరుకుంది. భౌతిక దాడుల‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతల దాడుల్లో భాగంగా హిందూపూర్‌లోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీగా కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడులకు దిగార‌ని స‌మాచారం.

Balakrishna home and office attacked fans worrying

హిందూపూర్‌లో భారీగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు మొహ‌రించ‌డంతో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం. తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో బాలకృష్ణ హిందూపూర్‌లో లేరని తెలుస్తున్నది.  అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ  పరిస్థితులను పర్యవేక్షిస్తున్న బాల‌య్య  హిందూపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు ఉన్న గ్లాస్‌ను పగలకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి సీనియర్ ఎన్టీఆర్‌పై జరిపిన దాడిగా టీడీపీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. దీనిపై పార్టీల‌కు అతీతంగా పోరాడాల‌ని అంటున్నారు. ఇలా వ‌రుస  దాడి ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభిమానులు పోస్టులతో అల్లాడిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి